Advertisement

‘ఓ మంచి రోజు చూసి చెప్తా’.. ఏటే...?

Feb 26 2021 @ 19:37PM

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రలలో నటించిన తమిళ చిత్రమొకటి ఇప్పుడు తెలుగులో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". ఈ చిత్రాన్ని తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర తెలుగు హక్కులను భారీ ధరకి సొంతం చేసుకున్న డాక్టర్‌ రావూరి వెంకటస్వామి.. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చ్ 19న విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేశారు. 


ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. "ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతిగారి నటన ఈ చిత్రానికే ఒక హైలైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెలగారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19న భారీగా విడుదల చేస్తున్నాము" అని తెలిపారు. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.