ఓ మై గాడ్‌... పంకజ్‌ త్రిపాఠీ!

Jun 4 2021 @ 01:17AM

అక్షయ్‌కుమార్‌ శ్రీకృష్ణ పరమాత్ముని పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘ఓ మై గాడ్‌’. దీనిని తెలుగులో ‘గోపాల గోపాల’గా రీమేక్‌ చేశారు. తెలుగులో శ్రీకృష్ణుడిగా పవన్‌కల్యాణ్‌ నటించారు. ఇప్పుడీ సినిమాకు హిందీలో సీక్వెల్‌ రూపొందుతోంది. ‘ఓ మై గాడ్‌ 2’లో పంకజ్‌ త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించనున్నారని బీటౌన్‌ టాక్‌. ‘ఓ మై గాడ్‌’లో పరేశ్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో ఆ పాత్రను వెంకటేశ్‌ పోషించారు. అయితే, సీక్వెల్‌లో పరేశ్‌ నటించడం లేదట. ఆయన బదులు పంకజ్‌ త్రిపాఠీని ఎంపిక చేశారట. అక్షయ్‌కుమార్‌ మళ్లీ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘ఓ మై గాడ్‌ 2’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాస్తవానికి, ఈ వేసవిలోనే చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు. కానీ, కరోనా రెండో దశ వల్ల కుదరలేదు. సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి సినిమాను తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారట. ‘ఓ మై గాడ్‌’కు ఉమేశ్‌ శుక్లా దర్శకత్వం వహించారు. సీక్వెల్‌కు ఆ స్థానంలో మరొక దర్శకుణ్ణి ఎంపిక చేశారట. ప్రస్తుతానికి అతడి పేరును సస్పెన్స్‌లో ఉంచారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.