మాస్క్‌ ధరించకపోతే జరిమానా...!

ABN , First Publish Date - 2022-04-26T13:37:53+05:30 IST

మాస్కు ధరించకపోతే జరిమానా విధిస్తారా? ఎమ్మెల్యేలకు లేదా? అంటూ ప్రతిపక్ష ఉపనేత ఒ.పన్నీర్‌సెల్వం ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో చర్యల్లో

మాస్క్‌ ధరించకపోతే జరిమానా...!

- ఎమ్మెల్యేలకు వర్తించదా?

- అసెంబ్లీలో ఓపీఎస్‌ ప్రశ్న


పెరంబూర్‌(చెన్నై): మాస్కు ధరించకపోతే జరిమానా విధిస్తారా? ఎమ్మెల్యేలకు లేదా? అంటూ ప్రతిపక్ష ఉపనేత ఒ.పన్నీర్‌సెల్వం ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో చర్యల్లో భాగంగా అందరూ మాస్క్‌ ధరించాలని, ధరించని వారికి రూ.500 జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో, సోమవారం శాసనసభ ప్రారంభమైన సమయంలో ఓపీఎస్‌ మాట్లాడుతూ, మాస్క్‌ ధరించని అందరికీ జరిమానా విధిస్తారా? ఆ నిబంధన నుంచి ఎమ్మెల్యేలకు మినహాయింపు ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం సమాధానమిస్తూ, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా మాస్క్‌ ధరించాలని కోరారు. అంతలో ఎమ్మెల్యేలందరికీ మాస్కులు పంపిణి చేసినట్లు ప్రకటించిన స్పీకర్‌ అప్పావు, మాట్లాడే సమయంలో అడ్డుకావడంతో మాస్క్‌లు తీసివేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా, సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాస్కు ధరించి ఉండగా, మాట్లాడే సమయంలో దానిని తీసివేశారు.

Updated Date - 2022-04-26T13:37:53+05:30 IST