ఓట్స్‌ చిల్లా

ABN , First Publish Date - 2021-02-27T18:09:56+05:30 IST

ఓట్స్‌ - ఒకకప్పు, బొంబాయి రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - పావు కప్పు, నీళ్లు - ఒక కప్పు, పసుపు - పావు టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

ఓట్స్‌ చిల్లా

కావలసినవి: ఓట్స్‌ - ఒకకప్పు, బొంబాయి రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - పావు కప్పు, నీళ్లు - ఒక కప్పు, పసుపు - పావు టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం: ముందుగా ఒట్స్‌ను క్రిస్ప్‌గా అయ్యే వరకు వేగించాలి. అవి చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక పాత్రలోకి తీసుకుని అందులో రవ్వ, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత పసుపు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి చిక్కటి మిశ్రమంలా ఉండేలా కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త మందంగా దోశలా పోయాలి. మూతపెట్టి నిమిషం పాటు ఉంచుకోవాలి. తరువాత చిల్లాను తిప్పి మరికాసేపు వేగించాలి. గ్రీన్‌ చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2021-02-27T18:09:56+05:30 IST