హైదరాబాద్/పంజాగుట్ట : పిల్లల్లో ఊబకాయం పెద్ద సమస్యగా మారిందని, దేశంలో 14.4 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ శరత్ చంద్ర అన్నారు. వరల్డ్ ఒబేసిటీ డేను పురస్కరించుకుని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.జి. శాస్త్రి, ఒబేసిటీ, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సురేందర్ ఉగలే, డయాబెటాలాజిస్ట్ డాక్టర్ దిలీప్ గుడే, పోషకాహార నిపుణులు అపర్ణతో కలిసి ఆయన మాట్లాడారు. పిల్లల్లో ఊబకాయంలో చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించిందన్నారు. బయట కొనే గోధుమపిండి మంచిది కాదని, గోధుమలు తెచ్చుకొని పిండి పట్టించుకోవాలని డాక్టర్ అపర్ణ అన్నారు.