Advertisement

ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాల ఏర్పాటుపై అభ్యంతరాలు

Dec 3 2020 @ 00:45AM
తహసీల్దార్‌ కిరణ్మయికి వినతిపత్రం అందజేస్తున్న మండల బీజేపీ నాయకులు

తహసీల్దార్‌కు  బీజేపీ నాయకుల వినతిపత్రం 

నర్సాపూర్‌(జి), డిసెంబరు 2 :  రైతువేదిక భవనాలపై ప్రఽధానమంత్రి నరేంద్రమోదీ, ఎంపీ సోయంబాపురావ్‌ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్‌ జిల్లా బీజేపీ పార్టీ నేతల పిలుపు మేరకు బుధవారం మండల బీజేపీ నాయకులు తహసీల్దార్‌ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు అర్జున్‌ఠాకూర్‌ మాట్లాడుతూ కేంద్రప్రభు త్వం నిధుల ఇస్తున్నా వేదికలపై ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని అన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిట్టపల్లి రాజేందర్‌ నాయకులు శేఖర్‌, కాల్వ లింగన్న, ప్రశాంత్‌,నర్సయ్య, భానుచంద్ర, రాజు, శ్రీధర్‌ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement