పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-04-21T06:28:30+05:30 IST

అసంపూర్తి రహదారి పనులను పూర్తి చేసేందుకు అటవీ శాఖ అనుమతి కోసం చేపట్టిన చలో జంగల్‌ మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని జడ్పీటీసీ నాగం కుమార్‌ అన్నారు.

పాదయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం
మాట్లాడుతున్న జడ్పీటీసీ నాగం కుమార్‌

చందుర్తి, ఏప్రిల్‌ 20: అసంపూర్తి రహదారి పనులను పూర్తి చేసేందుకు అటవీ శాఖ అనుమతి కోసం  చేపట్టిన చలో జంగల్‌ మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని జడ్పీటీసీ నాగం కుమార్‌ అన్నారు. చందుర్తి మండల కేంద్రం నుంచి మేడిపల్లి మండలం మోత్కురావుపేట మధ్య అటవీశాఖ అనుమతుల లేక నిలిచిన రోడ్డు నిర్మాణా పనులకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ నాయకులు పాదయాత్రకు పిలుపినిచ్చారు. పాదయాత్రకు ఆనుమతి లేదని మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ నాయుకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ నాగం కుమార్‌ మాట్లాడుతూ ప్రజా స్వామ్య బద్ధంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.  వేములవాడ నియోజక వర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ ఆది శ్రీనివాస్‌తోపాటు మండలంలోని కాంగ్రెస్‌ నాయకులను ఆరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు, అరెస్టు అయిన వారిలో కాంగ్రెస్‌  మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు గొట్టె ప్రభాకర్‌, పులి సత్తయ్య, ధర్మపురి శ్రీనివాస్‌,  శ్రీహరిరెడ్డి,  మల్లేశం, నేతికుంట జలపతి, తోట్ల అంజయ్య, కాయితి నాగరాజు, పోతరాజు రవి, దారం చంద్రం, మల్లారపు రాజయ్య, సంటి ప్రపాద్‌, ఏసుదాసు, ప్రసాద్‌, నారాయణ రెడ్డి, రాఖేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:28:30+05:30 IST