కోట ప్రాంతంలో ఇరుకుగా ఉన్న ఓ వీధి
హిందూపురం టౌన, మార్చి 27: పట్టణంలో స్థలాల విలువలు పెరిగిపోవడంతో వీధులను సైతం ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఫలితంగా కొన్ని వీధులు కుంచించుకుపోయాయి. ద్విచక్రవాహనం కూడా వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. మరికొన్ని ప్రాంతా ల్లో అయితే గతంలో వీధులు విశాలంగా లేకపోయినా భవనాలు ని ర్మించుకున్నారు. ఈకారణంగా అగ్ని ప్రమాదాలు జరిగితే ఆ వీధుల్లో కి వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి వెళ్లలేక నానా తంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. పట్ట ణం రోజు రోజుకు విస్తరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వీధులు విశాలంగా లేకపోవడం గమనార్హం. హస్నాబాద్, చక్కీటకార వీధులు, ఆబాద్పేట, ముక్కడిపేట, కోట ఏరియాతో పాటు మరికొన్ని ప్రాంతా ల్లో వీదులు ఇరకాటంగా మారాయి.
మేలుకోని అధికారులు
అసలే వీధులు ఇరకాటంగా ఉన్నాయి. దీనికితోడు డ్రైనేజీ కాలువలు కూడా ఆక్రమించుకుని మరుగుదొడ్లు, మెట్లు నిర్మించుకున్నారు. ఇరుకు సందుల్లో.. ఆపై ఆక్రమణలతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఈత తంగమంతా అధికారులకు తెలిసినా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆక్రమణలు తొలగించకపోవడం గమనార్హం. ఆ వీధుల్లోకి ఆటోలు కూడా వె ళ్లలేకపోతున్నాయి. ఇలాంటి ఇరుకైన వీధులు పట్టణంలో వందకు పై గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి టౌన ప్లానింగ్ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.