గుట్టలూ వదలట్లేదు!

ABN , First Publish Date - 2021-10-27T06:06:44+05:30 IST

పెనుమూరు మండలం గుత్తావాండ్లవూరు పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మూగజీవాలు ఆకలితీర్చే గుట్ట పోరంబోకును కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

గుట్టలూ వదలట్లేదు!
కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న గుట్ట

వైసీపీ నాయకుల ఆక్రమణయత్నాలపై ఫిర్యాదు

పెనుమూరు, అక్టోబరు 26: పెనుమూరు మండలం గుత్తావాండ్లవూరు పంచాయతీలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మూగజీవాలు ఆకలితీర్చే గుట్ట పోరంబోకును కొందరు వైసీపీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కలవగుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 1297లో 16.46 ఎకరాలు గుట్ట పొరంబోకు స్థలం ఉంది. ఇటీవల దీంట్లో 10 ఎకరాలు పట్టా చేసుకోవడానికి సర్వే చేసి రాళ్లు కూడా నాటారు. ఇది తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుట్ట స్థలం కబ్జా కాకుండా అక్కడ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ గుట్టలో ఎన్నో ఏళ్లుగా గుత్తావాండ్లవూరు, జలకంటాపురం, చామంతీపురం గ్రామస్తులు పశువులు, మేకలు, గొర్రెలు మేపుతుండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ గుట్టను ఆక్రమించడానికి ప్రయత్నాలు జరుపుతున్నారని,   ఆ గుట్టలో ఎవ్వరికీ పట్టాలు ఇవ్వొద్దని గ్రామస్తులు మంగళవారం తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందిన తహసీల్దారు చంద్రశేఖర్‌, వీఆర్వో కృపానందంతో కలసి ఆ గుట్టపై ఇది ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు  ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-27T06:06:44+05:30 IST