ఆక్సిజన్‌ సిలిండర్ల పట్టివేత

ABN , First Publish Date - 2021-05-10T04:39:20+05:30 IST

ప్రస్తుతం కొవిడ్‌ ఉధృతి కారణంగా కేవలం ఆస్పత్రులకు మాత్రమే ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయాలన్న నిబంధనలు ఉన్నాయి.

ఆక్సిజన్‌ సిలిండర్ల పట్టివేత
పట్టుకున్న ఆక్సిజన్‌ సిలిండర్ల వాహనం

జడ్చర్ల, మే 9: ప్రస్తుతం కొవిడ్‌ ఉధృతి కారణంగా కేవలం ఆస్పత్రులకు మాత్రమే ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రైవేట్‌ పరిశ్రమకు వెళ్తున్న ఆక్సిజన్‌ సిలిండ ర్‌లను జడ్చర్ల ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఆదివారం పోలీసుల సహకారంతో పట్టుకు న్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సీతారామ గ్యాస్‌ పరిశ్రమకు చెందిన ఆక్సీజన్‌ సిలిండర్‌లు జడ్చర్ల ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ పరిశ్ర మకు 15 ఏళ్లుగా సరఫరా చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి సురేందర్‌ తెలిపారు. ప్రభు త్వం జారీ చేసిన నిబంధనల మేరకు ఆక్సీజన్‌ సిలిండర్‌ల సరఫరాను సదరు పరిశ్రమకు ఇటీవల నిలిపేశామన్నారు. జడ్చ ర్లలోని పరి శ్రమ తమ సంస్థ ఆక్సీజన్‌ సిలిండర్‌లకు తెల్లరంగు వేసి, అదే ఇండ స్ట్రియల్‌ ఏరియాలో ఉన్న మరో గ్యాస్‌ పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మక్కై, ఆస్ప త్రులకు సరఫరా చేస్తున్నా మంటూ ఆక్సిజన్‌ సిలిండర్‌లను నింపుకుని తమ పరిశ్రమకు వినియోగిస్తున్నట్లు తెలిసిం దన్నారు. పోలీసుల సహకారంతో పరిశ్రమ వద్దకు వెళ్లి, అక్రమంగా వినియోగిస్తున్న తమ సంస్థ సిలిండర్‌లను పట్టుకున్నట్లు వెల్లడిం చారు. తమ సంస్థ 10 సిలిండర్‌లను తిరిగి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2021-05-10T04:39:20+05:30 IST