ఓబీసీకి సాగర్‌ జలాలు

ABN , First Publish Date - 2022-06-26T05:00:25+05:30 IST

మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు శనివారం ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు చేరాయి. జిల్లాలోని రామతీర్థం జలాశయంతో పాటు మంచినీటి చెరువులు అడుగంటడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో సాగర్‌ జలాలను విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి కుడికాలువకు 6,147 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్‌ ప్రధాన కాలువకు 5,094 క్యూసెక్కులు, జీబీసీకి 1,500 క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు (ప్రకాశం బార్డర్‌) 3,103 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 1,159 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుంది.

ఓబీసీకి సాగర్‌ జలాలు
ఓబీసీలోకి చేరిన జలాలు

మంచినీటి అవసరాలకు విడుదల

చెరువులు నింపేందుకు చర్యలు

దుర్వినియోగం కాకుండా కాలువలపై పర్యవేక్షణ

దర్శి, జూన్‌ 25 : మంచినీటి అవసరాల కోసం విడుదల చేసిన సాగర్‌ జలాలు శనివారం ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు చేరాయి. జిల్లాలోని రామతీర్థం జలాశయంతో పాటు మంచినీటి చెరువులు అడుగంటడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. దీంతో సాగర్‌ జలాలను విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి కుడికాలువకు 6,147 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా బుగ్గవాగుకు చేరుతోంది. బుగ్గవాగు నుంచి సాగర్‌ ప్రధాన కాలువకు 5,094 క్యూసెక్కులు, జీబీసీకి 1,500 క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు (ప్రకాశం బార్డర్‌) 3,103 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 1,159 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం విడుదల చేసిన నీరు కేవలం మంచినీటి చెరువులు నింపడానికి మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. సాగర్‌ జలాలు దుర్వినియోగం కాకుండా ఎన్‌ఎస్‌పీ అధికారులు కాలువలపై పర్యవేక్షిస్తున్నారు. దర్శి ఎన్‌ఎస్పీ డీఈ షేక్‌ అక్బర్‌బాషా ఆధ్వర్యంలో ఏఈలు భరత్‌, రేవతి, ఎన్నెస్పీ సిబ్బంది నిరంతరం కాలువలపై పర్యటిస్తున్నారు. ఎక్కడైనా సాగర్‌ జలాలు దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.  


Updated Date - 2022-06-26T05:00:25+05:30 IST