కరేడు చెరువు సప్లయ్‌ చానల్‌ ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2021-02-28T06:54:15+05:30 IST

కరేడు చెరువు సఫ్లయ్‌ ఛానల్‌ ఆక్రమణలను శుక్రవారం పంచాయతీ అధికారులు తొలిగించారు. జాతీయ రహదారికి పక్కన ఉన్న పెట్రోల్‌ బంకు వెనుక చెరువు కాలువ భూముల్లో ఇటీవల ఓ వైసీపీ నాయకుడు మామిడి మొక్కలు నాటాడు.

కరేడు చెరువు సప్లయ్‌ చానల్‌ ఆక్రమణల తొలగింపు

ఉలవపాడు, ఫిబ్రవరి 27 : కరేడు చెరువు సఫ్లయ్‌ ఛానల్‌ ఆక్రమణలను శుక్రవారం పంచాయతీ అధికారులు తొలిగించారు. జాతీయ రహదారికి పక్కన ఉన్న పెట్రోల్‌ బంకు వెనుక చెరువు కాలువ భూముల్లో ఇటీవల ఓ వైసీపీ నాయకుడు మామిడి మొక్కలు నాటాడు. దీనిపై గ్రామంలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అయితే ఇంతక ముందు కొందరు ఇదే పంట కాలువకు ఇరువైపుల ఆక్రమించుకొని మామిడి, సపోటా, జామాయిల్‌ సాగు చేస్తున్నారు. ఇదే అదునుగా ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రస్తుతం శాశ్వతంగా మామిడి మొక్కలు వేశారు. దీంతో తహసీల్దార్‌ సంజీవరావు ఉలవపాడు పంచాయతీ కార్యదర్శి విజయమ్మ, సిబ్బందితో కలిసి పోలీసుల సమక్షంలో పెట్రోల్‌ బంక్‌ వెనుక వేసిన మామిడి మొక్కలను పీకేశారు. స్ధలాన్ని చదును చేసి ‘ఇది ప్రభుత్వ భూమి దీనిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరిక బోర్డు పెట్టారు.

దీనిపై తహసీల్దార్‌ సంజీవరావును వివరణ కోరగా మండలంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలింగిచడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి, విలేజ్‌ సర్వేయర్‌, వీఆర్‌వోలతో కలిసి ఈవోఆర్డీ చెంచమ్మ పర్వేక్షణలో టీంవర్క్‌ చేయపట్టబోతున్నట్లు చెప్పారు. కరేడు చెరువు సప్లయ్‌ ఛానల్‌ ఇరువైపుల ఉన్న ఆక్రమణల తొలిగింపునకు ఎంపీడీవో రవికుమార్‌తో కలిసి పంచాయతీ కార్యదర్శి, సర్వేయర్‌, ఆర్‌ఐలతో కమిటీని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఆక్రమణలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-02-28T06:54:15+05:30 IST