Advertisement

ఐరన్ చేసుకుంటున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’ హీరో

Nov 21 2020 @ 21:20PM

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్న చిత్రం 'ఓదెల రైల్వేస్టేష‌న్'. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో  నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్నడిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. ఈ చిత్రంతో అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. 25 చిత్రాల‌కు పైగా ఇతర భాషల్లో న‌టించిన వ‌శిష్ట ఎన్. సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ప‌ల్లెటూరి అమ్మాయి 'రాధ' గా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. ఇటీవల ఆమె లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా హీరో వశిష్ట సింహ లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు సంపత్‌ నంది స్వగ్రామమైన ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను వాస్తవికతకు దగ్గిరగా రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు.  తిరుపతి పాత్రలో నటిస్తున్న హీరో వ‌శిష్ట సింహ లుక్‌లో.. బట్టలు ఐరన్ చేస్తూ పక్కా పల్లెటూరి యువకుడి లుక్‌లా ఉన్నారు. సాధారణ యువకుడిగా అందరికీ సహాయపడే క్యారెక్టర్‌లో ఆయన కనిపిస్తారని చిత్రయూనిట్‌ తెలిపింది.


తన లుక్‌ విడుదల సందర్భంగా హీరో వ‌శిష్ట‌ సింహ‌ మాట్లాడుతూ.. ''రాధామోహ‌న్‌గారి బ్యానర్‌లో సంపత్ నందిగారి క్రియేషన్‌లో.. అశోక్ తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఓదెల రైల్వేస్టేషన్ లాంటి ప్రత్యేకమైన చిత్రం ద్వారా తెలుగులో హీరోగా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది. తిరుపతి పాత్రలో పక్కా పల్లెటూరి కుర్రాడిగా కనిపిస్తాను. నా కెరీర్ కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. న్యాచురాలిటీకి దగ్గరగా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది.." అన్నారు.      

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.