మోదీ ప్రసంగాన్ని వీక్షించిన ఓడీఎఫ్‌ అధికారులు

ABN , First Publish Date - 2021-10-17T04:56:29+05:30 IST

దేశాన్ని ఆత్మ నిర్మర్‌గా మార్చడానికి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

మోదీ ప్రసంగాన్ని వీక్షించిన ఓడీఎఫ్‌ అధికారులు
ప్రధాని ప్రసంగాన్ని వీక్షిస్తున్న ఓడీఎఫ్‌ అధికారులు

కంది, అక్టోబరు 16: దేశాన్ని ఆత్మ నిర్మర్‌గా మార్చడానికి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శుక్రవారం కంది మండలంలోని ఎద్దుమైలారం వద్ద ఉన్న మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో  ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ఓడీఎఫ్‌ అధికారులు మోదీ ప్రత్యక్ష ప్రసంగాన్ని వీక్షించారు.  న్యూఢిల్లీలోని డీఆర్డీవో భవన్‌లోని కొఠారి ఆడిటోరియంలో  దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలో 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను 7 డివిజన్లుగా విభజించి ‘రక్ష ఆయుధ్‌’ పూజతో వేడుకను ప్రారంభించగా ప్రధాని మోదీ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల సిబ్బంది నుద్ధేశించి ప్రసంగించారు.  ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆయా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ  ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు మరింత పోటీతత్వంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రక్షణరంగ కార్యదర్శులు, జీఎం లోక్‌ప్రసాద్‌, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:56:29+05:30 IST