రఘురాజ్‌పూర్ కళాకారులకు రూ. 10 వేల చొప్పున సాయం

Jun 16 2021 @ 00:00AM

భువనేశ్వర్: ఒడిశా సంస్కృతి, సంప్రదాయాలు, కళలను బతికిస్తూ, సమాజానికి సేవ చేస్తున్న  రఘురాజ్‌పూర్ కళకారులకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఇవాళ రూ.10 వేల చొప్పున అందజేశారు. పూరీ జిల్లా రఘురాజ్‌పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం... మొత్తం 150 కుటుంబాలకు సీఎం ఆర్థిక సాయం అందజేశారు. వరల్డ్ హెరిటేజ్ విలేజ్‌గా గుర్తించిన రఘురాజ్‌పూర్‌లో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన స్థానిక కళాకారుల కోసం ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రభుత్వం ప్రత్యేక క్యాంప్ నిర్వహించింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.