Wedding kits in Odisha: నూతన దంపతులకు వెడ్డింగ్ కిట్‌లు.. కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు!

ABN , First Publish Date - 2022-08-14T18:46:56+05:30 IST

నూతన వధూవరులకు `వెడ్డింగ్ కిట్స్` (Wedding kits) అందించాలని ఒడిశా ప్రభుత్వం (Odisha government) నిర్ణయం తీసుకుంది.

Wedding kits in Odisha: నూతన దంపతులకు వెడ్డింగ్ కిట్‌లు.. కిట్‌లో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు!

నూతన వధూవరులకు `వెడ్డింగ్ కిట్స్` (Wedding kits) అందించాలని ఒడిశా ప్రభుత్వం (Odisha government) నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కిట్‌లో కుటుంబ నియంత్రణకు సంబంధించిన వస్తువులను ఉంచుతున్నారు. ఇటువంటి కిట్లను అందించడం దేశంలోనే మొట్టమొదటిసారి.  కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకే ఒడిశా ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేయాలని భావిస్తోంది. 


ఇది కూడా చదవండి..

Viral Video: బాటిల్ కప్ మీద ప్రయాణం కోసం కప్పల మధ్య ఫైటింగ్.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఈ కిట్లలో గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు, కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కలిగించే బుక్‌లెట్, పెళ్ళి రిజిస్ట్రేషన్ పత్రం వంటివి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన `మిషన్ పరివార్ వికాస్‌` కార్యక్రమంలో భాగంగా ఒడిశా ప్రభుత్వం తన వంతుగా కార్యాచరణ రూపొందించింది. ఈ కిట్‌తో పాటు నూతన దంపతులకు సురక్షిత శృంగారం, ప్రెగ్నెన్సీకి సంబంధించిన అంశాల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. ఆశా వర్కర్లకు ఈ బాధ్యతలను అప్పగించనున్నారు. 


మన దేశ జనాభా త్వరలోనే చైనాను మించి పోయే అవకాశాలు ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పలు రాష్ట్ర ప్రభుత్వలు కూడా కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తున్నాయి. కాగా, ఆ దిశగా దేశంలో ముందడుగు వేసిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలవనుంది.  

Updated Date - 2022-08-14T18:46:56+05:30 IST