Electric Vehiclesపై పూర్తి పన్ను మినహాయింపు

ABN , First Publish Date - 2021-11-01T16:11:33+05:30 IST

ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది...

Electric Vehiclesపై పూర్తి పన్ను మినహాయింపు

ఒడిశా ప్రభుత్వం ప్రకటన

భువనేశ్వర్ : ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది.ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై మోటారు వాహనాల పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తి మినహాయింపు ప్రకటించింది. ఒడిశా మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్ కింద ఈ మినహాయింపు 2025వ సంవత్సరం వరకు వర్తించనుంది. ఒడిశా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు, తయారీదారులు, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్‌లకు పలు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల పన్నులు, బ్యాటరీలతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజులపై వంద శాతం మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 


వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-వాహనాలపై సబ్సిడీ ఇవ్వాలని రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించినట్లు రవాణా శాఖ మంత్రి పద్మనవ్ బెహెరా గతంలో తెలిపారు.ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ‘ఈ-వెహికల్’ విధానాన్ని అమలు చేశాయి.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం వడ్డీ రహిత రుణాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ వాహనాలను అద్దెకు తీసుకున్నందుకు ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూలకు ప్రోత్సాహకాలు అందించాలని డిపార్ట్‌మెంట్ ప్రతిపాదించింది.మున్సిపల్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పార్కింగ్ ఫీజు రాయితీతో పాటు, పార్కింగ్ ప్రదేశాల్లో బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయం కల్పించాలని ప్రతిపాదన ఉందని ఒడిశా రవాణాశాఖ మంత్రి బెహెరా తెలిపారు.


Updated Date - 2021-11-01T16:11:33+05:30 IST