Viral Video: అతిగా ప్రవర్తించిన పోలీసు అధికారి.. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి మెడపై మోకాలితో..

ABN , First Publish Date - 2022-03-21T14:25:14+05:30 IST

స్కూల్ విద్యార్థిపట్ల ఓ పోలీసు అధికారి దారుణంగా ప్రవర్తించాడు. మెడపై మోకాలు పెట్టి హింసించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు అధికారి తీరుపట్ల నె

Viral Video: అతిగా ప్రవర్తించిన పోలీసు అధికారి.. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి మెడపై మోకాలితో..

ఎన్నారై డెస్క్: స్కూల్ విద్యార్థిపట్ల ఓ పోలీసు అధికారి దారుణంగా ప్రవర్తించాడు. మెడపై మోకాలు పెట్టి హింసించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు అధికారి తీరుపట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



విస్కాన్సిన్‌లోని కెనోషా పాఠశాలకు చెందిన 12ఏళ్ల విద్యార్థిని.. మధ్యాహ్న భోజన సమయంలో ఓ బాలుడితో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి షాన్ గుట్‌షో హుటాహుటిన ఆ విద్యార్థుల వద్దకు వెళ్లాడు. ఇద్దరిని నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్న విద్యార్థిని పోలీసు అధికారిని వెనక్కి నెట్టేసింది. దీంతో పోలీసు అధికారి ఆవేశంతో ఊగిపోయాడు. విద్యార్థిని నియంత్రించేందుకు.. ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యార్థిని నేలపై పడుకోబెట్టి.. మెడపై మోకాలు పెట్టి ఆమెను హింసించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా ఆ వీడియోను స్కూల్ యాజమాన్యం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అదికాస్తా వైరల్ అవడంతో.. సదరు అధికారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. షాన్ గుట్‌షో‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థిని తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. 






Updated Date - 2022-03-21T14:25:14+05:30 IST