మహిళా ఉద్యోగి పట్ల అధికారి అనుచిత ప్రవర్తన

ABN , First Publish Date - 2021-12-07T14:56:36+05:30 IST

అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ అధికారిపై మహిళా ఉద్యోగి మేయర్‌ ...

మహిళా ఉద్యోగి పట్ల అధికారి అనుచిత ప్రవర్తన

హైదరాబాద్‌ సిటీ : అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ అధికారిపై మహిళా ఉద్యోగి మేయర్‌ విజయలక్ష్మికి సోమవారం ఫిర్యాదు చేశారు. కేంద్ర కార్యాలయంలో ఉండే స్టాటిస్టికల్‌ అధికారి శ్రీనివాస్‌ చార్మినార్‌ జోన్‌లో పనిచేసే ఓ మహిళను కొంత కాలంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. దీనిపై విభాగం ఉన్నతాధికారికి మహిళ ఫిర్యాదు చేయగా, ఉన్నతాధికారి సర్దుకుపోవాలని సూచించినట్టు సమాచారం. సోమవారం కూడా సదరు ఉన్నతాధికారి ఆ ఇద్దరితో చాంబర్‌లో సమావేశమై సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విషయం తెలిసిన మేయర్‌ కార్యాలయ అధికారులు వారిని పిలిపించారు. ఈ క్రమంలో ఆ మహిళ.. విజయలక్ష్మి వద్ద తన గోడు వెల్లబోసుకున్నట్టు తెలిసింది. దీంతో మేయర్‌ సీఎంఓహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ అధికారిని మాతృ సంస్థకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Updated Date - 2021-12-07T14:56:36+05:30 IST