కార్యాలయ స్థలం కావాలండోయ్‌..

ABN , First Publish Date - 2022-06-25T09:10:29+05:30 IST

మే నెలకు గాను హైదరాబాద్‌ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలం (ఆఫీస్‌ స్పేస్‌) లీజు లావాదేవీలు దాదాపు మూడింతలు పెరిగి 61 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నాయి.

కార్యాలయ స్థలం కావాలండోయ్‌..

గతనెల ఆఫీస్‌ స్పేస్‌ లీజుల్లో మూడింతల వృద్ధి: జేఎల్‌ఎల్‌ 

మే నెలకు గాను హైదరాబాద్‌ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలం (ఆఫీస్‌ స్పేస్‌) లీజు లావాదేవీలు దాదాపు మూడింతలు పెరిగి 61 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నాయి. గత ఏడాదిలో ఇదే నెలకు మొత్తం 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఒప్పందాలు కుదిరాయని ప్రాపర్టీ కనల్టింగ్‌ కంపెనీ జేఎల్‌ఎల్‌ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదిరిన 48 లక్షల చదరపు అడుగుల లీజు ఒప్పందాలతో పోల్చినా 28 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. గత నెల ఆఫీస్‌ స్పేస్‌ లీజుల్లో 91 శాతం బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై నగరాల్లోనే జరిగాయని జేఎల్‌ఎల్‌ రిపోర్టు పేర్కొంది. 

Updated Date - 2022-06-25T09:10:29+05:30 IST