హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ జూమ్!
ABN , First Publish Date - 2022-10-05T09:17:43+05:30 IST
ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు కాలానికి హైదరాబాద్ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం 49 శాతం
9 నెలల్లో 56 పెరిగిన స్థలం లభ్యత
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు కాలానికి హైదరాబాద్ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం 49 శాతం పెరిగి 3.28 కోట్ల చదరపు అడుగులుగా నమోదైంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ వాణిజ్య స్థల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేశాయని నివేదిక పేర్కొంది. గత ఏడాది జనవరి-సెప్టెంబరుతో పోలిస్తే, బెంగళూరు, ముంబై నగరాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన కార్యాలయ స్థలం తగ్గగా.. మిగతా నగరాల్లో మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన 56 శాతం పెరిగి కొత్తగా 79 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చింది.