వైవీయూలో అధికారి లైంగిక వేధింపులు?

ABN , First Publish Date - 2021-07-27T05:19:17+05:30 IST

యోగివేమన యూనివర్శిటీలో ఓ అధికారి లైంగికంగా వేధించారంటూ ఆడియోటేపులు కలకం రేపాయి. ఇక్కడి ప్రిన్సిపల్‌ కార్యాలయంలోని ఓ అధికారి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ

వైవీయూలో అధికారి లైంగిక వేధింపులు?

బాధితురాలి ఆడియోతో వెలుగులోకి

కడప వైవీయూ, జూలై 26: యోగివేమన యూనివర్శిటీలో ఓ అధికారి లైంగికంగా వేధించారంటూ ఆడియోటేపులు కలకం రేపాయి. ఇక్కడి ప్రిన్సిపల్‌ కార్యాలయంలోని ఓ అధికారి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ అక్కడే నానటీచింగ్‌ ఉద్యోగం చేసే బాధితురాలు సహచరులతో చెప్పుకున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ వ్యవహారం సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా..

వైవీయూలోని ప్రిన్సిపల్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగిని ఆదివారం సెలవురోజు అయినప్పటికి ఓ అధికారి పిలిపించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఉద్యోగిని పట్ల ఆ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిసింది. ఈ విషయమై యూనివర్శిటీ అధికారులు మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే అధికారి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు తన సహోద్యోగులకు ఫోనలో చెప్పి బాధపడిందని సమాచారం. ఆ అధికారిపై ఉమెన సెల్‌ కు సైతం ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. బాధితురాలు మాట్లాడిన ఆడియో సోమవారం వెలుగులోకి రావడంతో యూనివర్సిటీ అంతా దీనిపైనే చర్చ నడిచింది. వైవీయూలోని నానటీచింగ్‌ సిబ్బంది పట్ల ప్రిన్సిపల్‌ కార్యాలయంలో ఇలా జరగడం పలువురు సిబ్బందిని దిగ్ర్భాంతికి గురిచేసింది. యూనివర్శిటీలో గతంలో కూడా ఇటువంటివి అసభ్యకర సంఘటనలు జరిగాయి. అప్పటి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారి ఓ ఉద్యోగినిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం మంచిదికాదని నిజనిర్ధారణ చేసి చర్యలు చేపట్టాలని యూనివర్శిటీలో పలువురు చర్చించుకుంటున్నారు. 

ఇదే విషయమై వీసీ సూర్యకళావతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా బాధితురాలు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే విచారించి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజిస్ర్టార్‌ విజయరాఘవప్రసాదును ఫోన ద్వారా అడుగగా యూనివర్శిటీలో గుసగుసలు వినిపిస్తున్నాయి తప్ప లిఖితపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

Updated Date - 2021-07-27T05:19:17+05:30 IST