‘పది’ పరీక్షలకు ముమ్మరంగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-21T05:02:52+05:30 IST

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల ఏర్పా ట్లపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.

‘పది’ పరీక్షలకు ముమ్మరంగా ఏర్పాట్లు
రాజోలి జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాలను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ గ్రేసీబాయి

- పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అధికారులు

- వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి

- విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఉండవల్లి/ అయిజ/ గట్టు/ రాజోలి/ అలంపూర్‌/ మానవపాడు/ గద్వాల అర్బన్‌,  మే 20 : సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల ఏర్పా ట్లపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాలను తహసీల్దార్లు, ఎంఈ వోలు పరిశీలించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బంది ని ఆదేశించారు. ఉండవల్లి మండల కేంద్రంలోని మూడు పరీక్ష కేంద్రాలను శుక్రవారం తహసీల్దార్‌ వీరభద్రప్ప, ఎంఈవో శివప్రసాద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వీరభద్రప్ప మాట్లాడుతూ మండల కేంద్రం లో గతంలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేవారమని, ఈ ఏడాది అదనంగా మైనారిటీ గురుకుల పాఠశాలలోనూ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపా రు. ఈ కేంద్రాల్లో ఉండవల్లి, క్యాతూరు, లింగనవాయి, తక్కశిల, పుల్లూరు, బొంకూర్‌, పుల్లూరు జ్యోతిబా పూలే, కలుగొట్ల కేజీబీవీ, మైనారిటీ గురుకుల పాఠశాలలతో పాటు అలంపూర్‌ చౌరస్తాలోని ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు ఎంఈవో శివప్రసాద్‌ తెలిపారు. పరీక్ష కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. 


- విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అయిజ తహసీల్దార్‌ యాదగిరి సూచించారు. అయిజ పట్టణంలోని పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉత్తనూర్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


- గట్టు మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలతో పాటు మాచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలను తహసీల్దార్‌ సహదేవ్‌, ఎంఈవో కొండారెడ్డి పరిశీలించారు. వారి వెంట ప్రధానో పాధ్యాయుడు నర్సింహులు ఉన్నారు.


- రాజోలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని రాజోలి తహసీల్దార్‌ గ్రేసీ బాయి పరిశీలించారు. తరగతి గదులను, వసతులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది బజారి, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


- అలంపూర్‌ పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేం ద్రాలను తహశీల్దార్‌ ఇంద్రాణి శుక్రవారం పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో వసతులు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో అశోక్‌కుమార్‌, హెచ్‌ఎం శ్రీని వాసులు పాల్గొన్నారు.


- మానవపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఇన్‌చార్జి తహసీల్దార్‌ నరేశ్‌ శుక్రవారం పరిశీలించారు. ప్రధానోపాధ్యాయుడు చెన్నయ్యతో మాట్లాడారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.


ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఎస్‌డీవో

పరీక్షలు బాగా రాసి, ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఎసడీవో ప్రియదర్శిని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు. మానవపాడు మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతిగృహం విద్యార్థులతో శుక్రవారం ఆమె మాట్లాడారు. ఆమె వెంట వార్డెన్‌ రామకృష్ణ ఉన్నారు. 


అన్ని రూట్లలో బస్సులు

ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని రూట్లలో ప్రత్యేకంగా బస్సులను నడుతున్నట్లు గద్వాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు బస్సు పాస్‌, పరీక్ష హల్‌టికెట్‌ చూపితే ఉచితంగా ప్రయాణించేందుకు అను మతి స్తామన్నారు.  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Updated Date - 2022-05-21T05:02:52+05:30 IST