అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-27T06:11:50+05:30 IST

నివర్‌ తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌




ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 26 : నివర్‌ తుపాను ప్రభావం పూర్తిగా తొలగిపోయే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను తమిళనాడులో తీరం దాటినా దాని ప్రభావం జిల్లాపై ఇంకా ఉందని క లెక్టర్‌ చెప్పారు. తీర ప్రాంత మండలాల్లో వర్షాలు కురుస్తున్నందున ప్రత్యేక అఽధికారులను నియమించామని, ప్రజలకు ప్రాణ, ఆస్తినష్ట జరగకుండా చ ర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సిద్ధంగా ఉన్నాయని, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కూడా అందుబాటులో ఉందని కలెక్టర్‌ వెల్లడించారు.


Updated Date - 2020-11-27T06:11:50+05:30 IST