కవ్వాల టైగర్‌జోన్‌లో అధికారుల పర్యటన

ABN , First Publish Date - 2022-06-29T04:12:52+05:30 IST

కవ్వాల టైగర్‌ జోన్‌లో హైద్రాబాద్‌ దూలపల్లి ట్రైనీ సెక్షన్‌ అధికారులు 27 మంది రెండు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు మంగళవారం ఇందన్‌పల్లి రేంజ్‌లోని కల్పకుంట, నీలుగాయికుంట ప్రాంతాల్లో పర్యటించారు. ఎఫ్‌డీవో మాధవరావు వన్య ప్రాణుల సంరక్షణకు ఏర్పాటు చేసిన నీటి కుంటలు, వాటి ఆవశ్యకతతోపాటు గడ్డి క్షేత్రాల గురించి వారికి వివరించారు.

కవ్వాల టైగర్‌జోన్‌లో అధికారుల పర్యటన
ఇందన్‌పల్లి అటవీ ప్రాంతంలో గడ్డి క్షేత్రాలపై అవగాహన కల్పిస్తున్న ఎఫ్‌డీవో మాధవరావు

జన్నారం, జూన్‌ 28 : కవ్వాల టైగర్‌ జోన్‌లో హైద్రాబాద్‌ దూలపల్లి ట్రైనీ సెక్షన్‌ అధికారులు 27 మంది  రెండు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు మంగళవారం ఇందన్‌పల్లి రేంజ్‌లోని కల్పకుంట, నీలుగాయికుంట ప్రాంతాల్లో పర్యటించారు. ఎఫ్‌డీవో మాధవరావు వన్య ప్రాణుల సంరక్షణకు ఏర్పాటు చేసిన నీటి కుంటలు, వాటి ఆవశ్యకతతోపాటు గడ్డి క్షేత్రాల గురించి వారికి వివరించారు. అత్యధికంగా శాఖహార జంతువులు, వాటి లక్షణాల గురించి, అటవీ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, వన్యప్రాణుల కోసం తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి తెలిపారు. నీటికుంటలు, బేస్‌ క్యాంపుల ఏర్పాటు, గడ్డి క్షేత్రాల వల్ల ఉపయోగాలు, గడ్డి క్షేత్రాలు ఎలా ఏర్పాటు చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఇందన్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో హఫీజోద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-29T04:12:52+05:30 IST