Divorce: కువైత్‌లో మునుపెన్నడూ లేని విధంగా షాకింగ్ గణాంకాలు నమోదు!

ABN , First Publish Date - 2021-11-23T15:15:11+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో విడాకుల విషయంలో మునుపెన్నడూ లేని విధంగా షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి.

Divorce: కువైత్‌లో మునుపెన్నడూ లేని విధంగా షాకింగ్ గణాంకాలు నమోదు!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో విడాకుల విషయంలో మునుపెన్నడూ లేని విధంగా షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి. తాజాగా వెలువడిన అధికారిక డేటా ప్రకారం కువైత్‌లో ప్రతిరోజు 20 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 15 కువైటీ మహిళలకు సంబంధించినవి కాగా, 5 కేసులు ప్రవాసులకు చెందినవిగా తెలుస్తోంది. 2016 నుంచి 2020 వరకు ఐదేళ్లకు సంబంధించి కేంద్ర గణాంకాల శాఖ తాజాగా డేటాను విడుదల చేసింది. కాగా, గతేడాది కరోనా కారణంగా విడాకుల రేటు కాస్తా తగ్గింది. ఈ ఐదేళ్లలో మొత్తం 36,345 విడాకుల కేసులు నమోదయ్యాయి. వీటిలో 26,626 కువైటీ పౌరులకు సంబంధించిన కేసులైతే, 3,950 వలసదారులకు చెందినవి. 


సంవత్సరాల వారిగా గణాంకాలు ఇలా ఉన్నాయి..

* 2016లో నమోదైన మొత్తం విడాకుల కేసులు 7,223. వీటిలో 5,259 కేసులు కువైటీ మహిళలకు సంబంధించినవి. వీటిలో 4,386 కువైత్ భర్తలు, 873 నాన్-కువైటీ భర్తలు.  

* 2017లో మొత్తం విడాకుల కేసులు 7,433. వీటిలో 5,402 కువైటీ మహిళల కేసులు ఉన్నాయి. వీటిలో 4,510 కువైత్ భర్తలు, 892 నాన్-కువైటీ భర్తలు ఉన్నారు. 

* 2018లో నమోదైన మొత్తం విడాకుల కేసులు 7,869. వీటిలో 5,764 కువైటీ మహిళల కేసులు ఉన్నాయి. వీటిలో 4,839 కువైత్ భర్తలు, 925 నాన్-కువైటీ భర్తలు ఉన్నారు. 

* 2019లో నమోదైన మొత్తం విడాకుల కేసులు 7,888. వీటిలో 5,857 కేసులు కువైటీ మహిళలకు సంబంధించినవి. వీటిలో 4,938 కువైత్ భర్తలు, 919 నాన్-కువైటీ భర్తలు. 

* 2020లో మొత్తం విడాకుల కేసులు 5,932. వీటిలో 4,294 కువైటీ మహిళల కేసులు ఉన్నాయి. వీటిలో 3,953 కువైత్ భర్తలు, 341 నాన్-కువైటీ భర్తలు ఉన్నారు.     


Updated Date - 2021-11-23T15:15:11+05:30 IST