ప్రభుత్వ పథకాల విజయవంతంలో అధికారులదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2022-05-20T05:56:43+05:30 IST

ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలుచేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

ప్రభుత్వ పథకాల విజయవంతంలో అధికారులదే కీలకపాత్ర
రామాంజులరెడ్డి వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి

 మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, మే 19: ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలుచేయడంలో అధికారుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న రామాంజులరెడ్డికి జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం మునిసిపల్‌ కౌన్సిలర్లు, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసే అధికారుల గురించి ప్రజలు ఏళ్ల తరబడి గుర్తించుకుంటారని అలా గుర్తించుకునే అధికారుల్లో రామాంజులరెడ్డి ఒకరని కొనియాడారు. ఆయన్ను ఇక్కడ నుంచి పంపించడం తనకు ఇష్టం లేదని, పట్టణ రహదారుల విస్తీర్ణంలో రామాంజులరెడ్డి ప్రధాన ప్రాత పోషించారని గుర్తుచేశారు. అనంతరం కమిషనర్‌ రామాంజులరెడ్డి మాట్లాడుతూ తన సర్వీ్‌సలో మంత్రి జగదీ్‌షరెడ్డి వంటి నేతను చూడలేదని సూర్యాపేట అభివృద్ధి విషయంలో అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మంత్రి పడే తపనను చూసి ఆశ్చర్య పోయేవాడినని అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితా, జడ్పీటీసీ జీడీబిక్షం, నాయకులు వై.వెంకటేశ్వర్లు, వైస్‌చైర్మన్‌ పుట్టకిశోర్‌, జుట్టు కొండ సత్యనారాయణ, పెద్దిరెడ్డి గణేష్‌, పెద్దిరెడ్డిరాజా, దండ మురళీదర్‌రెడ్డి, రాంమూర్తి యాదవ్‌, సవరాల సత్యనారాయణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:56:43+05:30 IST