సమన్వయంతో పని చేయకుంటే.. పాలకవర్గాన్ని రద్దు చేస్తా

ABN , First Publish Date - 2022-06-26T07:14:10+05:30 IST

పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీపీవో నిమ్మగడ్డ బాలాజీ అధికారులను, పాలకవర్గ సభ్యులను హెచ్చరించారు.

సమన్వయంతో పని చేయకుంటే.. పాలకవర్గాన్ని రద్దు చేస్తా
డీపీవో నిమ్మగడ్డ బాలాజీ

డీపీవో నిమ్మగడ్డ బాలాజీ

కోరుకొల్లులో అపారిశుధ్యంపై ఆగ్రహం

కలిదిండి, జూన్‌ 25 : పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీపీవో నిమ్మగడ్డ బాలాజీ అధికారులను, పాలకవర్గ సభ్యులను హెచ్చరించారు. ఆంధ్రజ్యోతిలో ప్రచారార్భాటాలేనా శీర్షికన  కోరుకొల్లులో అధ్వాన పారిశుధ్యంపై శనివారం  ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం డీపీవో నిమ్మగడ్డ బాలాజీ, డీఎల్‌పీవో సంపత్‌ కుమారితో కలసి కోరుకొల్లు సందర్శించి రహదారులపై ఉన్న చెత్తకుప్పలను, పూడుకుపోయిన డ్రెయిన్లను పరిశీలించారు. అనం తరం సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ, పాలకవర్గ సభ్యులతో పారిశుధ్యంపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడు తూ కోరుకొల్లులో పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. సర్పంచ్‌, పాలకవర్గ సభ్యుల మధ్య సమన్వయం లేకపోవటంతో పారిశుధ్యం కుంటుపడిందన్నారు.  సమన్వయంతో పనిచేయకపోతే పంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేసి స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని హెచ్చరించా రు.  పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టకుంటే కలెక్టర్‌ దృష్టికి తీసు కుని వెళ్తనన్నారు. పారిశుధ్య కార్మికులకు సక్రమంగా జీతాలివ్వాలని, మూల పడిన పారిశుధ్య వాహనాలను  వినియోగించాలన్నారు. వీధి లైట్లు వెలిగే లా చూడాలన్నారు. పారిశుధ్య పనులు చేయటానికి పంచాయతీలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.25 లక్షలు ఉన్నాయన్నారు. ఆ నిధులతో పారిశుధ్య పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలన్నారు. కోరు కొల్లును స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. 


పశువుల ఆస్పత్రి భవనం పరిశీలన 

‘దాత ఔదార్యం–నేడు శిథిలం’ కథనంపై స్పందన

ముదినేపల్లి, జూన్‌ 25: ముదినేపల్లిలోని యెర్నేని చలమయ్య స్మారక ప్రభుత్వ పశు వైద్యశాల పాత భవనాన్ని పశుసంవర్థక శాఖ అధికారులు  పరిశీలించారు. ‘‘దాత ఔదార్యం–నేడు శిథిలం’’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఏలూరు జిల్లా పశు సంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నెహ్రూ బాబు ఆదేశాల మేరకు శిథిల భవనాన్ని ఆ శాఖ మండవల్లి డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరసింహారావు, వీఏఎస్‌లు డాక్టర్‌ వనిత, డాక్టర్‌ హరికృష్ణతో కలసి పరిశీలించి నివే దిక పంపించారు. ప్రస్తుతం ఆ భవనంలో ఆసుపత్రి ఫర్నిచర్‌, మందులు, ఇతర మెటీరియల్‌ను నిల్వ ఉంచినట్టు గుర్తించారు. 


Updated Date - 2022-06-26T07:14:10+05:30 IST