‘కొండవనమాల’లో ఆయిల్‌పాం పరిశ్రమ

ABN , First Publish Date - 2021-02-28T04:25:09+05:30 IST

ఓ ప్రవేటు సంస్థ ఆయిల్‌పాం పరిశ్రమ కోసం భూమిని కొనుగోలు చేయడం, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయడం ఉమ్మడిజిల్లాలోనే ఇదే ప్రథమం

‘కొండవనమాల’లో ఆయిల్‌పాం పరిశ్రమ

కొణిజర్ల మండలంలో ఏర్పాటుకు సన్నాహాలు

ఉమ్మడిజిల్లాలో తొలి ప్రైవేటు సంస్థ రిజిస్ట్రేషన్‌

కొణిజర్ల, ఫిబ్రవరి 27: ఓ ప్రవేటు సంస్థ ఆయిల్‌పాం పరిశ్రమ కోసం భూమిని కొనుగోలు చేయడం, ధరణి ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయడం ఉమ్మడిజిల్లాలోనే ఇదే ప్రథమం. కొణిజర్ల మండలం కొండవనమాల రెవెన్యూ పరిధిలో ఖమ్మంజిల్లా పరిధిలోనే తొలిసారిగా పామాయిల్‌ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. తహసీల్దార్‌ కృష్ణ, సంబంధిత కంపెనీ వారు అందించిన వివరాలు ప్రకారం గోద్రేజ్‌ అగ్రీవేట్‌ కంపెనీ  నిర్వాహకులు మండలంలోని కొండవనమాల గ్రామ రెవెన్యూ పరిధిలో ఐదు హెక్టార్ల భూమిని ఆయిల్‌పాం పరిశ్రమ ఏర్పాటుకు కొనుగోలు చేశారు. ముగ్గురు రైతుల నుంచి కొనుగోలు చేసిన ఈ భూమిని శనివారం తహసీల్దార్‌ కృష్ణ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించి కంపెనీ ప్రతినిధులకు పత్రాలను అందజేశారు. కంపెనీ పేరుమీద రిజిస్ట్రేషన్‌ నిర్వహించడం ఇదే తొలిసారి అని తహసీల్దార్‌ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్‌పాంకు మంచి ఆదరణ ఉండబోతుందని, కొండవనమాలలో రోజుకు నాలుగు టన్నుల సామార్ధ్యం కలిగన ఫ్యాక్టరీని నిర్మించనున్నట్లు తెలిపారు. పత్రాలు అందుకున్న వారిలో గోద్రేజ్‌అగ్రివేట్‌ కంపెనీ బిజినెస్‌ హెడ్‌ సాగత నియోగి, ఏవీవీ ప్రొడక్ట్‌ అండ్‌ ప్రాజెక్టు ఏవీపీఎంఎస్‌ ఎంఎస్‌కుమార్‌, హెచ్‌ఆర్‌డి జీఎం నాగప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-02-28T04:25:09+05:30 IST