రోజురోజుకూ పెరుగుతున్న నూనెల ధరలు

ABN , First Publish Date - 2021-01-13T05:11:51+05:30 IST

సంక్రాంతి పండుగ పూట వంటనూనెల ధరలు వినియో గదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం పిండి పం టల తయారీ పెరగడంతో వాటికి అవసరమైన వంటనూనె లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వ్యాపారులు తమ అక్రమా ర్జనకు తెరలేపుతూ ధరలు పెంచేశారు. కొందరు మరో అడుగు ముందుకేసి నాసిరకం నూనెల ను బ్రా ండెడ్‌గా నమ్మి స్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న నూనెల ధరలు

లీటర్‌ ప్యాకెట్‌ రూ.145 పైనే

బ్రాండెడ్‌ పేరిట కల్తీనూనెలు

పండుగపూట వ్యాపారుల మాయాజాలం

కామారెడ్డి జిల్లాలో అక్రమ ఆయిల్‌ వ్యాపారం

కల్తీనూనెతో ప్రజల ఆరోగ్యానికి దెబ్బ

నాసిరకం నూనెలను బ్రాండెడ్‌ పేర్లతో అంటగడుతున్న వైనం

మోసపోతున్న వినియోగదారులు

పట్టించుకోని సంబంధిత అధికారులు

కామారెడ్డి, జనవరి 12: సంక్రాంతి పండుగ పూట వంటనూనెల ధరలు వినియో గదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం పిండి పం టల తయారీ పెరగడంతో వాటికి అవసరమైన వంటనూనె లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వ్యాపారులు తమ అక్రమా ర్జనకు తెరలేపుతూ ధరలు పెంచేశారు. కొందరు మరో అడుగు ముందుకేసి నాసిరకం నూనెల ను బ్రా ండెడ్‌గా నమ్మి స్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ దం దా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతున్నా సంబం ధిత శాఖ అధి కారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేద నే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూనె విక్రయించే వ్యాపారులు ఎక్కడికక్కడ ముడుపులు అందిస్తుండడంతో వారి వ్యాపారాల వైపు దృష్టిపెట్టకుండా కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో వారికి నచ్చిన విధంగా నూనెల ధరలను పెంచడమే కాకుండా కల్తీ నూనెలను ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలకు హాని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

కామారెడ్డి నుంచే కొనసాగుతున్న అక్రమదందా

నాలుగు నెలల క్రితం వరకు బ్రాండెడ్‌ నూనె లీటర్‌ ప్యా కెట్‌ హోల్‌ సేల్‌ ధర రూ.100 లోపు ఉండగా.. ప్రస్తుతం రూ.140 నుంచి రూ.160కు పెరిగింది. రిటెయిల్‌గా పల్లినూ నె రూ.110 నుంచి రూ.130 వరకు పెంచేశారు. బ్రాండెడ్‌ వంటనూనెల ధరలను బట్టి స్థానికంగా మార్కెట్‌ చేసే కం పెనీలు మోసాలకు గురిచేస్తున్నాయని తెలుస్తోంది. డిమాం డ్‌ లేని, నాసిరకం నూనెలను పల్లి, నువ్వు, సన్‌ఫ్లవర్‌ నూనె ల్లో కలిపి విక్రయిస్తున్నారని సమాచారం. కామారెడ్డికి చెంది న ఓ బడా వ్యాపారి మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామ పరిధిలో ఈ తతంగానికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో ంచి లారీల ద్వారా నాసిరకం నూనెలు దిగుమతి చేసుకుం టున్నారు. ఇందులో పల్లి, సన్‌ఫ్లవర్‌, నువ్వులు తదితర ప్లేవ ర్స్‌ కలుపుతున్నారు. అందమైన ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తు న్నారు. డబ్బాలు, ప్యాకెట్లు, కాటన్లలో ప్యాక్‌ చేసి బ్రాండెడ్‌ గుర్తులు ఇస్తున్నారు. ప్యాకెట్లపై పల్లి, పల్లికాయ పెద్దసైజ్‌ చిత్రాలు ముద్రించి, చిన్నసైజ్‌ అక్షరాల్లో పల్లినూనె 20 శా తం, రిఫైండ్‌ పామాయిల్‌ 80శాతం కలిపి బ్రాండెడ్‌ ఎడిబు ల్‌ వెజిటేబుల్‌ ఆయిల్‌గా ముద్రిస్తున్నారు. బ్రాండెడ్‌ నూనె తయారీకి అనుమతి ఉన్నా అది పూర్తిగా పల్లి, సన్‌ఫ్లవర్‌ నూనెలు కావన్న విషయాన్ని కస్టమర్లకు చెప్పడం లేదు. ప్యాకెట్లపై ఉన్న ఫొటోలు, పల్లి, ఇతర వంటనూనెల పదార్థా ల డిజైన్లను బట్టి వ్యాపారులు బ్రాండెడ్‌ ఆయిల్‌గా నమ్మి స్తూ లోకల్‌ బ్రాండ్‌ వంటనూనెలు విక్రయిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యానికి ఎసరు

కల్లీ ఆయిల్‌ను సప్లయ్‌ చేస్తున్న వారిపై ఎలాంటి దాడు లు చేయకుండా బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు సదరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. కామా రెడ్డి జిల్లా కేంద్రంతో పాటు, మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో వెలిసిన ఈ అక్రమ దందా ప్రతీ ఒకరికి తెలిసిన ముడుపులు తీసుకుంటూ ప్రజా ఆరోగ్యానికి ఎసరు తెస్తు న్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లరోడ్డులోని బై పాస్‌ బ్రిడ్జి, కామారెడ్డి వాగు బ్రిడ్జి మధ్యలో ఉన్న ఓ కేంద్రం లో ఈ దందా జోరుగా సాగుతుందని తెలుస్తోంది. కల్తీ నూ నెను తయారు చేస్తూ పట్టణంతో పాటు మండలంలోని ఇ తర గ్రామాల నుంచి మహిళలు, పురుషులను ఆటోల ద్వా రా తరలించి వారి ద్వారా ప్యాకింగ్‌ చేయిస్తూ పట్టణంలోని కిరాణ, సూపర్‌ మార్కెట్లకు సరాఫరా చేస్తూ దండుకుంటు న్నారు. ఇక మాచారెడ్డి మండలంలో ఉన్న ఆయిల్‌ కేంద్రం వారు రాత్రి వేళల్లో తతంగం అంతా చేస్తున్నారని సమాచా రం. గతంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌లుగా పనిచేసిన వారు ప్ర స్తుతం పదవిలో ఉన్నవారు, చోటామోటా లీడర్లు కొందరు ఈ మాఫీయాకు సహకరిస్తూ డబ్బులు దండుకుంటున్నార నే ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ ఆయిల్‌ మాఫీయా విష యంపై ప్రజలకు తెలియక తాము వాడుతున్న వంటనూనె స్వచ్ఛందంగా ఉందని భావనలో ఉంటూ వాడుతుండడంతో దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఆయిల్‌ వాడిన 100లో 70 మందికి 30 నుంచి 40 సంవత్సరాల లో పే జీర్ణకోశ వ్యాధులు గుండె, కిడ్నీ సమస్యలు వస్తుండడం పట్ల పలువురు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.కోట్లలో వ్యాపారం 

జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, పక్క రాష్ట్రాలకు సైతం ఈ కల్తీ మాఫియా అడుగుపెట్టిందంటే క్షేత్రస్థాయిలో ఉన్న తాధికారులు, ప్రజాప్రతినిధుల అండ ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. నాసిర కం వంట నూనెలను జిల్లా కేంద్రంగా అమ్మకాలు జరుపు తున్నా ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాపారుల అనుచరవ ర్గం బిల్లులు లేకుండా వ్యాపారం సాగిస్తున్నారని తెలుస్తోం ది. ఫలితంగా ప్రభుత్వానికి చేరాల్సిన వాణిజ్య పన్నుల ఆదా యం కోల్పోవాల్సి వస్తోంది. వీరు రోజుకు రూ.25 లక్షలకు పైగా వంటనూనెల వ్యాపారం చేస్తారు. నెలకు దాదాపు రూ.7.50 కోట్ల అక్రమ వ్యాపారం చేస్తారని కొందరు అధికా రులు గుసగుసలాడుకోవడం గమనార్హం. జిల్లా కేంద్రంగా అక్రమ దందాకు తెరలేపుతున్న కేసులు నమోదైన దాఖలా లు లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలో ని డైలీ మార్కెట్‌, జేపీఎన్‌ చౌరస్తా, గాంధీగంజ్‌ తదితర కిరాణా దుకాణాలలో, సూపర్‌ మార్కెట్లలో ఎక్కువ మొత్తం లో ఈ కేంద్రాల నుంచి సప్లయ్‌ అవుతున్న నూనెలనే విక్ర యిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నాసిరకం నూనెల పై ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే మున్ముందు ప్రజల ఆరోగ్యాలకు రక్షణ లేకుం డా పోతోందని అభిప్రాయాలు వైద్య వర్గాల నుంచి వ్యక్తమ వుతున్నాయి.

Updated Date - 2021-01-13T05:11:51+05:30 IST