ఫెవిపిరవిర్ తయారీకి గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2021-05-11T20:44:15+05:30 IST

ఫెవిపిరవిర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో... హైదరాబాద్ కంపెనీ షేర్లు భారీగా జంప్ అయ్యాయి.

ఫెవిపిరవిర్ తయారీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : ఫెవిపిరవిర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో...  హైదరాబాద్ కంపెనీ షేర్లు భారీగా జంప్ అయ్యాయి. వివిమెడ్ ల్యాబ్స్ స్టాక్స్ నేడు భారీగా ఎగిసాయి. ఏకంగా 5 శాతం లాభపడి రూ. 28.35 వద్ద క్లోజ్ కావడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం ఫెవిపిరవిర్ తయారీ, ర్కెటింగ్‌కు వివిమెడ్‌కు డీజీహెచ్ఐ అనుమతించింది. కరోనా నేపధ్యంలో వ్యాక్సీన్ లేదా ఇతర సంబంధిత మెడిసిన్స్ తయారీ ఫార్మా కంపెనీల స్టాక్స్ అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. 


కరోనా చికిత్సలో వినియోగించే యాంటీ వైరల్ ఔషధం ఫెవిపిరవిర్ తయారీకి ఈ హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీకి అనుమతి లభించడం గమనార్హం. ఈ టాబ్లెట్లను 200 ఎంజీ, 400 ఎంజీ రూపంలో తయారు చేయడానికి డీజీహెచ్‌ఐనుండి అనుమతులు వచ్చినట్లు వివిమెడ్ కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ఔషధాన్ని కరోనాలో తేలికపాటి నుండి మధ్యస్థాయి లక్షణాలున్న రోగుల చికిత్సకు వినియోగిస్తారు. 

Updated Date - 2021-05-11T20:44:15+05:30 IST