ఒకే ఆకాశం, ఒకే భూమి

ABN , First Publish Date - 2022-08-01T06:06:16+05:30 IST

భూమి అంటే కేవలం భూమి కాదు దున్ని దున్ని చదును చేసిన మట్టి దాని ప్రతి పొరా తీస్తున్నప్పుడు...

ఒకే ఆకాశం, ఒకే భూమి

భూమి అంటే కేవలం భూమి కాదు 

దున్ని దున్ని చదును చేసిన మట్టి 

దాని ప్రతి పొరా 

తీస్తున్నప్పుడు 

స్వేద స్వప్నాలు ప్రవహిస్తాయి 

నదులుగా. 

యుద్ధం జరగవచ్చు, భూమి కోసం 

ఎక్కడైనా 

గాయపడేవి హృదయాల గోడలే 

మండే పొలం,

తనది కావచ్చు, మరొకరిది కావచ్చు 

అల్లాడేది జీవితాలే, ఆకలితో 

గొడ్రాలయ్యేది భూమియే 

ఎప్పుడు కుదురుతుందో, ఏమో 

అందరి కోసం ఒక కల అల్లడం. 

ఎప్పుడు కలుస్తామో ఏమో 

మన అందరం, ఒకే చెట్టు క్రింద 

ఒకే ప్రార్థనతో 

దీనికోసం గొడవ పడుతూనే వున్నాను 

కాలంతో ప్రతిక్షణం 

పిట్టలు ఎగిరెగిరి 

సీమలు దాటుతుంటే 

కంటున్నానొక కల 

పరదేశి కాని కల 

జాతీయత నా కల 

ఒకే జాతీయత...

ప్రపంచంలో ఎక్కడవున్నా 

ఒకే ఆకాశం, ఒకే భూమి. 

ఒకే జాతీయత

మలయాళ మూలం:

అంబిలి ఒమన కుట్టన్‌

తెలుగు సేత: 

ఎల్‌. ఆర్‌. స్వామి

99490 75859 


Updated Date - 2022-08-01T06:06:16+05:30 IST