జూలైలో ఓలా ఈ-స్కూటర్‌

ABN , First Publish Date - 2021-04-23T06:40:26+05:30 IST

ఈ ఏడాది జూన్‌లో తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. అంతేకాదు, దేశంలో అతిపెద్ద హైపర్‌చార్జర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో...

జూలైలో ఓలా ఈ-స్కూటర్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ తెలిపింది. అంతేకాదు, దేశంలో అతిపెద్ద హైపర్‌చార్జర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగా, 400 నగరాల్లో లక్షకు పైగా ఫాస్ట్‌ చార్జిం గ్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఓలా పేర్కొంది. రూ.2,400 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడా ది ఓలా ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. ఈ ప్లాంట్‌ ద్వారా 10,000 మందికి ఉద్యోగం లభించనుంది. జూన్‌ కల్లా ప్లాంట్‌ పూర్తవుతుందని ఓలా చైర్మన్‌ భవిశ్‌ అగర్వాల్‌ తెలిపారు. 


Updated Date - 2021-04-23T06:40:26+05:30 IST