యానిమేటర్‌గా వయోవృద్ధుడు

ABN , First Publish Date - 2022-10-07T05:03:12+05:30 IST

ప్రభుత్వ నింబధనల ప్రకారం యానిమేటర్లకు 18నుంచి 45 లోపు వయస్సుండాలి. అందుకు విరుద్ధం గా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో 60యేళ్లు పైబడి, వృద్ధాప్య పింఛన తీసు కుంటున్న ఉత్తమరెడ్డి ఇనే వ్యక్తిని యాని మేటర్‌గా ఎలా నియమించారని గ్రామైక్య సంఘాల మహిళలు జయమ్మ, రామక్రిష్ణమ్మ, రమాదేవి, ఆయిషా తదితరులు ప్రశ్నిస్తు న్నారు.

యానిమేటర్‌గా వయోవృద్ధుడు
విలేకరులతో మాట్లాడుతున్న కావేరి గ్రామైక్య సంఘం మహిళలు


32 సంఘాల్లో అర్హులు  లేరా?

ప్రశ్నిస్తున్న మహిళా సంఘాల సభ్యులు

్లకదిరి, అక్టోబరు 6: ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభివృద్ధికి వైఎస్సార్‌ వెలుగు పథకం కింద గ్రామైక్య సంఘాలను నిర్వహిస్తోంది. గ్రామైక్య సంఘాల అకౌం ట్లు నిర్వహించడానికి యానిమే టర్లును నియమించారు. ప్రభుత్వ నింబధనల ప్రకారం యానిమేటర్లకు 18నుంచి 45 లోపు వయస్సుండాలి. అందుకు విరుద్ధం గా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో 60యేళ్లు పైబడి,  వృద్ధాప్య పింఛన తీసు కుంటున్న ఉత్తమరెడ్డి ఇనే వ్యక్తిని యాని మేటర్‌గా ఎలా నియమించారని గ్రామైక్య సంఘాల మహిళలు జయమ్మ, రామక్రిష్ణమ్మ, రమాదేవి, ఆయిషా తదితరులు ప్రశ్నిస్తు న్నారు. శివలీలా గ్రామైక్య సంఘానికి ఉత్తమరెడ్డి యానిమేటర్‌గా విధులు నిర్వహి స్తున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 60కి పైబడి ఉంది. వృద్ధాప్య పింఛన ఐడీ 12500013879. 60యేళ్లు దాటినవారికి యానిమేటర్‌గా ఇవ్వవచ్చా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కావేరి గ్రామైక్య సంఘంలో 32 సంఘాలున్నాయి. ఈసంఘానికి ఉన్న యానిమే టర్‌ను తొలగించారు.  శివలీల గ్రామైక్య సంఘంలో ఉన్న స్వా తి అనే మహిళను కావేరి గ్రామైక్య సం ఘం యానిమేటర్‌గా నియమిం చారు. తమ గ్రామైక్య సంఘాల్లో యాని మేటర్‌గా నియమిం చడానికి అర్హులు లేరా అని ఆ మహిళలు ప్రశిస్తున్నారు. వెంటనే తమ గ్రామైక్య సంఘానికి తమ సంఘాల్లో ఉన్నమహిళలను యానిమేటర్లగా నియమించాలని డిమాండ్‌ చేశారు. 

 దీనిపై ఏసీ రమణయ్యను వివరణ కోరగా... కుమ్మరవాండ్లపల్లిలో కావేరీ గ్రామైక్య సంఘానికి తాత్కాలికంగా యానిమేటరు నియమిం చామని తెలిపారు. పక్షోత్సవాలు జరుగుతున్న దృష్ట్యా ఆమెను తా త్కాలికంగా నియమించామన్నారు. అలాగే శివలీలా గ్రామైక్య సంఘంలో యానిమేటర్‌గా వయోవృద్ధుడు పనిచేస్తున్నట్లు మా దృష్టికి రాలేదని,  ఆవిధంగా పనిచేస్తుంటే తప్పే అన్నారు. పరిశీలించి  చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


Updated Date - 2022-10-07T05:03:12+05:30 IST