మూడేళ్ల పాపను కడతేర్చిన నాన్నమ్మ ప్రియుడు.. అలా ఎందుకు చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-05T09:08:19+05:30 IST

ప్రేమ కోసం లేటు వయసులో ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్న ఒక వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. ఇంట్లో మూడేళ్ల పాపతో ఒంటరిగా ఉంటున్న 50 ఏళ్ల ఒక మహిళను అతను ప్రేమించాడు. వారిద్దరి ప్రేమకు అడ్డుగా ఉందని ఆ చిన్నారిని చాటుగా తీసుకుపోయి...

మూడేళ్ల పాపను కడతేర్చిన నాన్నమ్మ ప్రియుడు.. అలా ఎందుకు చేశాడంటే..

ప్రేమ కోసం లేటు వయసులో ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్న ఒక వ్యక్తిని పోలీసుల అరెస్టు చేశారు. ఇంట్లో మూడేళ్ల పాపతో ఒంటరిగా ఉంటున్న 50 ఏళ్ల ఒక మహిళను అతను ప్రేమించాడు. వారిద్దరి ప్రేమకు అడ్డుగా ఉందని ఆ చిన్నారిని చాటుగా తీసుకుపోయి చంపేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 25 న ఢిల్లీ లోని ఒక నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్‌లో ఒక మూడేళ్ల పాప మృతదేహం పోలీసులకు దొరికింది.  ఆ పాప హత్య కేసు విచారణ చేస్తుండగా పోలీసులకు పాప నాన్నమ్మ రబీ దేవి(పేరు మార్చబడినది, 50) గురించి తెలిసింది. ఆమె రెండు రోజుల క్రితమే పాప కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


పాప తండ్రి ఒక దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తుండగా.. తల్లి పాపను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పాప తన నాన్నమ్మతోనే ఉండేది. ఒక  మూడేళ్ల పాపను ఎవరు హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పాప కుటుంబ సభ్యులు, ఇంటి చుట్టుపక్కల వారందరినీ కలిపి దాదాపు 75 మందిని ప్రశ్నించారు. జైలులో ఉన్న పాప తండ్రిని కూడా ప్రశ్నించారు. కానీ ఫలితం లేకపోయింది. అనకోకుండా పాప తల్లికి ఒక విషయం గుర్తుకు వచ్చింది.


పాప నాన్నమ్మ రబీ దేవికి అదే వీధిలో నివసించే హేమంత్(55) అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు పాప తల్లి పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు హేమంత్ గురించి ఆరా తీశారు. హేమంత్ గతంలో దొంగతనాలు చేసి శిక్ష అనుభవించి వచ్చాడని, ప్రస్తుతం కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. హేమంత్‌పై అనుమానంతో పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొని గట్టిగా విచారణ చేసేసరికి అతడు నేరం ఒప్పుకున్నాడు. తన ప్రియురాలైన రబీ దేవితో సమయం గడిపేందకు ఆ చిన్నారి అడ్డంగా ఉండడంతో చాటుగా తీసుకుపోయి పెద్ద రాయితో తలపై కొట్టి హత్య చేశానని తన వాంగ్మూలంలో చెప్పాడు.


పోలీసులు హేమంత్‌పై పాప హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Updated Date - 2022-01-05T09:08:19+05:30 IST