Viral Video: సంచుల్లోంచి కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేస్తున్న బిచ్చగాడు.. డబ్బును చూసి నివ్వెరపోయిన జనం

Published: Tue, 21 Dec 2021 00:42:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon

Viral Video: సంచుల్లోంచి కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరేస్తున్న బిచ్చగాడు.. డబ్బును చూసి నివ్వెరపోయిన జనం

సోషల్ మీడియాలో ఒక విచిత్ర వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వృద్ధుడు కరెన్సీ నోట్లను రోడ్డుపై విచ్చలివిడిగా ఎగరేస్తూ కనిపించాడు. అతనికి మతి స్థిమితం లేనట్టు ఉంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైని నగరంలో జరిగింది.


ఉజ్జైని నగరంలోని నాగదా రైల్వే స్టేషన్ బయట సోమవారం ఒక వృద్ధుడు రూ.100, రూ.50 నోట్లను గాల్లో ఎగిరేస్తున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు ఇది చూసి నివ్వెరపోయారు. వారిలో ఒక ప్రయాణికుడు ఆ వృద్ధుడి చేసే పనిని వీడియోగా రికార్డ్ చేశారు. ఆ తరువాత ఒక సంచిలో నుంచి రూ.10, రూ.20 నోట్లను కూడా తీసి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై విసిరేశాడు. విచిత్రం ఏమిటంటే అక్కడున్న వారెవరో ఆ నోట్లను ముట్టుకోలేదు. పైగా ఆ ముసలి వ్యక్తికి అలా చేయవద్దని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతను మతి స్థిమితం లేనట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆ నోట్లతో పాటు అతని సంచిలో నుంచి కొన్ని ఆస్తి పత్రాలు కూడా జారిపడుతున్నట్లు కనిపించాయి. 


ఇదంగా జరిగాక అక్కడున్న జనం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆ వృద్ధుడిని అతని డబ్బుతో సహా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.