వృద్ధులు జీవన భృతి పొందొచ్చు

ABN , First Publish Date - 2020-11-29T05:14:04+05:30 IST

వృద్ధులు జీవన భృతి పొందొచ్చు

వృద్ధులు జీవన భృతి పొందొచ్చు
ఆశ్రమంలోని వృద్ధులతో సీనియర్‌ జడ్జి జె.కవిత

  • సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత

షాద్‌నగర్‌ అర్బన్‌: పిల్లల ఆదరణకు నోచుకోని వృద్ధులు చట్టపరంగా జీవనభృతి పొందే హక్కు ఉంటుందని షాద్‌నగర్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి జె.కవిత తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల చైతన్య సేవాశ్రమంలో శనివారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పింఛన్‌ రావడం లేదని పలువురు వృద్ధులు జడ్జి దృష్టికి తెచ్చారు. కారణాలు తెలుసుకుని పింఛన్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటామని జడ్జి కవిత వారికి తెలిపారు. వృద్ధ తల్లిదండ్రుల పోషణను వారి సంతానం విస్మరిస్తే సీనియర్‌ సిటిజెన్‌ యాక్ట్‌ ప్రకారం జీవనభృతి పొందవచ్చని చెప్పారు. వృద్ధ తల్లిదండ్రుల పోషణను వారి పిల్లలు విధిగా చూసుకోవాలని అన్నారు. నేడు తల్లిదండ్రులకు అండగా ఉంటేనే భవిష్యత్తులో వారి పిల్లలు కూడా తల్లిదండ్రుల బాగోగులు చూస్తారని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ, న్యాయవాదులు చంద్రయ్య, వేణుగోపాల్‌, శ్రీనివాసమూర్తి, సబియాసుల్తానా, ఆంజనేయులుగౌడ్‌, నాగరాజు, శంకరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-29T05:14:04+05:30 IST