పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు సందడి

ABN , First Publish Date - 2021-01-25T06:42:48+05:30 IST

మండలంలోని పలు పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థులు సందడి చేశారు.

పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు సందడి
అచ్యుతాపురం ఉన్నత పాఠశాలలో కలుసుకున్న పూర్వ విద్యార్థులు

  అచ్యుతాపురం/ అచ్యుతాపురం రూరల్‌ , జనవరి 24 : మండలంలోని పలు పాఠశాలల్లో ఆదివారం పూర్వ విద్యార్థులు సందడి చేశారు. అచ్యుతాపురం ఉన్నత పాఠశాలలో 1989-90, హరిపాలెం హైస్కూల్‌లో 1995-96 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదువుకున్న వారంతా వారివారి పాఠశాలల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా  ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆట పాటలతో సరదాగా గడిపారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు.  పి.బాబ్జీ, ధర్మిరెడ్డి అప్పలనాయుడు, గుడాల వేణు, లంకాడ శ్రీనివాసరావు, పెంకె చంటి, చోడిపల్లి అప్పారావు, లాలం పద్మ, కిరణ్‌ కుమార్‌, రమణమ్మ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


Updated Date - 2021-01-25T06:42:48+05:30 IST