రాజమహేంద్రవరం సిటీ, మార్చి 27: రాజమహేంద్రవరం సీజీటీఎం స్కూల్ ప్రాంగణంలో ఆదివారం శ్రీగౌతమి విద్యాపీఠం ఓరియంటల్ కళాశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగింది. 1972 నుంచి 2004 వరకు కళాశాలలో చదువుకున్న 132 మంది విద్యార్థులందరూ కలుసుకున్నారు. అలనాటి జ్ఞాపకలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శివకామేశ్వరి పీఠం అధినేత ఈమని దక్షిణామూర్తిని ఘనంగా సత్కరించారు. సహచర మిత్రబృందానికి జ్ఞాపికలను ఇచ్చుకున్నారు. కార్యక్రమంలో ఈమని కామేశ్వరరావు, శాస్త్రి, కుంతల ప్రసాద్, మిర్యాల ప్రసాద్, టీవీ ప్రకాశరావు, పీవీఎస్ కృష్ణారావు, కె.ప్రభాకర్, డి.మల్లికార్జునరావు, ప్రకాశం పాల్గొన్నారు.