మూడ్రోజులుగా కొడుకు నుంచి ఫోన్.. ఎంతకీ లిఫ్ట్ చేయని Mother.. ఇంటికెళ్లి అసలేం జరిగిందో చూడమని ఫ్రెండ్‌కు చెప్పగా.. దారుణం..!

ABN , First Publish Date - 2022-05-28T14:54:49+05:30 IST

మూడు రోజుల నుంచి తల్లికి ఫోన్‌ చేస్తున్నా తీయకపోవడంతో అనుమానం వచ్చి సమీపంలో ఉంటున్న స్నేహితుడు పవన్‌ను ఇంటికి పంపించాడు...

మూడ్రోజులుగా కొడుకు నుంచి ఫోన్.. ఎంతకీ లిఫ్ట్ చేయని Mother.. ఇంటికెళ్లి అసలేం జరిగిందో చూడమని ఫ్రెండ్‌కు చెప్పగా.. దారుణం..!

  • వృద్ధురాలి హత్య
  • ఇంటికి తాళం
  • మూడు రోజులుగా రాని పని మనిషి
  • ఇల్లు ఖాళీ చేసిన పక్కింటివారు

హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి శ్రీకృష్ణానగర్‌ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు హత్యకు (Murder) గురైంది. ఆమెను చంపేసి నిందితులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. మూడు రోజులుగా తల్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో (Phone Lift) మలేషియాలో ఉన్న ఆమె కుమారుడు స్నేహితుడిని ఇంటికి పంపడంతో హత్య వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌కు చెందిన తలారి సుజాత(73)కు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్త రెండేళ్ల క్రితం మృతి చెందాడు. కుమారుడు కిరణ్‌కుమార్‌ మలేషియాలో ఉద్యోగం (Job) చేస్తున్నాడు. కుమార్తెలు అనిత, కవిత, సంగీత నగరంలో ఉంటున్నారు. వీరికి వివాహాలయ్యాయి.


అసలేం జరిగింది..!?

సుజాత పేట్‌ బషీరాబాద్‌ ప్రాంతం శ్రీ కృష్ణానగర్‌ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. కుమారుడు మలేషియా నుంచి రోజూ తల్లితో ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. మూడు రోజుల నుంచి తల్లికి ఫోన్‌ చేస్తున్నా తీయకపోవడంతో అనుమానం వచ్చి సమీపంలో ఉంటున్న స్నేహితుడు పవన్‌ను ఇంటికి పంపించాడు. పవన్‌ శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. లోపల నుంచి దుర్వాసన రావడంతో కిరణ్‌కుమార్‌కు సమాచారం అందించాడు. కిరణ్‌ తన అక్కలకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకుని తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా తల్లి నేలపై మృతి చెంది ఉంది. 


ఎక్కడివి అక్కడే కానీ..

పేట్‌బషీరాబాద్‌ సీఐ రమేష్‌ సిబ్బందితో చేరుకుని హత్య నాలుగు రోజుల క్రితం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు (Gold), డబ్బు (Cash) ఎక్కడివి అక్కడే ఉన్నాయని కుమార్తెలు తెలిపారు. ఒంటి మీదుఉన్న బంగారం కొంత మాయమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో పని చేస్తున్న రమణమ్మ మూడు రోజులుగా రావడం లేదు. పక్కింట్లో ఉండేవాళ్లు మూడు రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్లపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధురాలి ఒంటిపై ఎటువంటి గాయాలూ లేవు. గొంతునులిమి చంపి ఉండొచ్చని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2022-05-28T14:54:49+05:30 IST