Advertisement

ఊరెళ్తున్నానంటే.. చంపేశారు!..

Aug 1 2020 @ 16:24PM

వలంటీరు తప్పిదం.. రెండు నెలలుగా అందని పింఛను

వెణుతురుమిల్లిలో వృద్ధురాలి ఆవేదన


గుడ్లవల్లేరు(కృష్ణా జిల్లా) : రెండు నెలలుగా పింఛను అందక వృద్ధురాలు లబోదిబోమంటున్న సంఘటన గుడ్లవల్లేరు మండలం వెణుతురుమిల్లిలో వెలుగుచూసింది. తీరా ఏమిటని ఆరా తీయగా నీవు బతికిలేవు పొమ్మని సెలవివ్వడంతో ఆమె బోరుమంటోంది.  వెణుతురుమిల్లి చెందిన పాగోలు భాగ్యం  కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛను పొందుతోంది. జూన్‌ నెలలో అల్లుడు చనిపోయినందున తాను ఊరు వెళ్తున్నానని వలంటీరుకు చెప్పి వెళ్లింది. ఊరు నుంచి వచ్చాక పింఛను తీసుకుంటానని చెప్పింది. ఆ నెల పింఛను రాలేదు.  ఒక నెలంతా ఏమీ తెలియక ఊరుకుంది. 


రెండో నెలలో కూడా పింఛను రాకపోయే సరికి పంచాయతీ అధికారుల చుట్టూ తిరిగింది. నీవు చనిపోయినట్లు జాబితాలో పేరు వచ్చినందున పింఛను ఆగిపోయినట్లు వారు సెలవిచ్చారు. వలంటీరు పొరపాటున డెత్‌ కాలంలో పాగోలు భాగ్యం పేరు ఎంటర్‌ చేయడంతో ఆమె పింఛను ఆగిపోయింది.  దీంతో తనని బతికుండగానే చంపేశారని, రెండు నెలలుగా పింఛను ఇవ్వడం లేదని లబోదిబోమంది. ఈ విషయమై కార్యదర్శి కోటేశ్వరరావు వివరణ కోరగా ఆన్‌లైన్‌లో పొరపాటు జరిగిందని,  విషయం సరిచేస్తున్నామని చెప్పారు.  ఆగస్టు నెలలో కూడా పింఛను వస్తుందో లేదో పాలకులకే ఎరుక. ఎలాంటి ఆసరా లేని వృద్ధురాలిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా  ఉంది.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.