AP News: వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన వృద్ధురాలు..

ABN , First Publish Date - 2022-09-01T18:34:24+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓ వృద్దురాలు షాక్ ఇచ్చింది.

AP News: వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన వృద్ధురాలు..

గుంటూరు జిల్లా (Guntur Dist.): జగనన్న పెన్షన్ (Jagananna Pension) పంపిణీ చేసేందుకు వెళ్లిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy)కి ఓ వృద్ధురాలు (old woman) షాక్ (Shock) ఇచ్చింది. పెన్షన్ ఎవరిస్తున్నారో తెలుసా అని అడగడంతో.. ఆ వృద్దురాలు వెంటనే చంద్రబాబు (Chandrababu) అని సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడున్న ప్రజాప్రతినిధులు అవాక్కయ్యారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు వాలంటీర్ల అవతారం ఎత్తారు. గురువారం ఉదయం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తూ ఎవరు పంపించారో తెలుసా? అంటూ ప్రచారం చేస్తున్నారు.

Updated Date - 2022-09-01T18:34:24+05:30 IST