Advertisement

పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’

Aug 11 2020 @ 21:35PM

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి.. తాజాగా ‘ఓల్డేజ్’ అనే టాపిక్ మీద మాట్లాడారు. 


‘‘ఎగ్జిస్టెన్స్‌కి ఓల్డేజ్ ఉండదు. కానీ ఇక్కడ పుట్టిన ప్రతి దానికి ఓల్డేజ్ తప్పదు. మనం రిటైర్ అయిపోయామని గవర్నమెంట్ చెబితే నీరసం వస్తది. నేను ఈ ప్రపంచానికి అక్కర్లేదా అని భాధ అనిపిస్తది. సడన్‌గా అందరూ పట్టించుకోవడం మానేస్తారు. భవిష్యత్తు చీకట్లా ఉంటది. ఏం చేయాలో తెలియక చాలా మంది భగవంతుడిని నమ్ముకుంటారు. ఓల్డేజ్‌లో భగవద్గీత చదివి ఏం చేస్తాం. చదివితే చిన్నప్పుడు చదవాలి. కొంచెం జాగ్రత్త పడేవాళ్లం. ఇప్పుడు చదివి ఉపయోగం లేదు. ఆ రామకోటి రాస్తూ మీ పిల్లలికి కనిపించకండి. మిమ్మల్ని ముసలాళ్లలో కలిపేస్తారు. మీ పిల్లలకి ఏమీ తెలియదు అనుకోవద్దు. డెఫినెట్‌గా మీ అనుభవం వాళ్ళ దగ్గర లేదు. కానీ మీరు స్కూల్లో చదువుకున్నారు. వాళ్లు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వాళ్ళకి కూడా చాలా విషయాలు తెలుసు. అందుకే మీరే అప్డేట్ అవ్వండి. వాళ్ళ మైండ్‌తో ఆలోచించండి. మీ అవసరం వాళ్ళకి కలిగేలా చేయండి. ఓల్డేజ్‌లో కొంత డబ్బు దాచుకోండి. రోజూ ఒంటికాలి మీద రెండు నిమిషాలైనా తపస్సు చేయండి. మీ మోకాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. ఒంటి కాలితో కూర్చొని లేవగలిగేలా ఉండండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం 65 సంవత్సరాలు వస్తే ఓల్డేజ్ మొదలవుతున్నట్లు లెక్క. ఏదో ఒక ఆర్ట్ నేర్చుకుని దానితో లవ్‌లో పడండి. రైట్ హ్యాండ్‌తో చేసే పనులు లెఫ్ట్ హ్యాండ్‌తో చేయడం ప్రాక్టీస్ చేయండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి ట్రైనింగ్ ఇచ్చే పనిలో మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటది. మీకు దణ్ణం పెడతా. ఆ వైట్ అండ్ వైట్ వేసుకుని పిల్లలకి కనపడొద్దు. వాళ్ళ ముందు కృష్ణా.. రామా అనొద్దు. యోగ చేస్తున్నానని చెప్పకండి. ఐ యామ్ గోయింగ్ ఫ్రమ్ వర్కౌట్ అని చెప్పండి. లేదంటే మిమ్మిల్ని ముసలాళ్ల లిస్ట్‌లో పడేస్తారు. యంగ్‌స్టర్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయండి. మీకోసం యంగ్‌స్టర్స్ మీ ఇంటికి రావాలి. మీ పిల్లలు చూడాలి. ఎంత డబ్బు ఉన్నా.. ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక పని చేయండి.. గ్రేస్‌ఫుల్‌గా కనబడతారు. మీ మెచ్యురిటీయే మీకందం. ముఖం మీద మీ ముడతలు కూడా అందంగా కనబడతాయి..’’ అని పూరి తెలిపారు. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.