నేపాల్‌ ప్రధాని ఓలీపై నేడు నిర్ణయం

ABN , First Publish Date - 2020-07-07T07:43:21+05:30 IST

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజకీయ భవితవ్యా న్ని నిర్ణయించాల్సిన 45 మంది సభ్యుల నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ(ఎన్‌సీపీ) సమావేశం బుధవారానికి వాయుదా పడింది...

నేపాల్‌ ప్రధాని ఓలీపై నేడు నిర్ణయం

కాఠ్మాండు, జూలై 6: నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజకీయ భవితవ్యా న్ని నిర్ణయించాల్సిన 45 మంది సభ్యుల నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ(ఎన్‌సీపీ) సమావేశం బుధవారానికి వాయుదా పడింది. ఎన్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మాధవ్‌కుమార్‌ నేపాల్‌తో చైనా రాయబారి హౌ యాంకీ భేటీ తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ప్రధాని ఓలీ వర్గం, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ వర్గంగా ఎన్సీపీ చీలిపోయింది. ఇద్దరి మధ్య సయోధ్య కోసమే గతంలో రెండుసార్లు సమావేశం వాయిదా పడింది. పార్టీ చీలిపోతే మద్దతివ్వాలని ఓలీ నేపాల్‌ ప్రతిపక్ష పార్టీ నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ ద్యూబాను కోరారు.


Updated Date - 2020-07-07T07:43:21+05:30 IST