100 మీ. ఫ్రీస్టయిల్‌లో ఒలింపిక్‌ రికార్డ్‌

Jul 30 2021 @ 03:50AM

పురుషుల 100 మీ. ఫ్రీస్టయిల్‌లో అమెరికా స్విమ్మర్‌ కెలెబ్‌ డ్రెస్సెల్‌ ఒలింపిక్‌ రికార్డుతో పసిడి పతకం చేజిక్కించుకున్నాడు. తొలి వ్యక్తిగత స్వర్ణం దక్కించుకున్న డ్రెస్సెల్‌ 47.02 సె. రికార్డ్‌ టైమింగ్‌తో గమ్యం చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన  డిఫెండింగ్‌ చాంపియన్‌ కైల్‌ చాల్మర్స్‌ను కంగుతినిపించాడు. కైల్‌ (47.08సె.) రజతంతో సరిపెట్టుకోగా, కొలిస్నికోవ్‌ (రష్యా, 47.44సె) కాంస్యం సాధించాడు.


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.