నగరంలో ఒలింపిక్‌ రన్‌

ABN , First Publish Date - 2022-06-23T06:54:47+05:30 IST

అంతర్జాతీయ ఒలింపిక్‌ డే సందర్భంగా నగరంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒలింపిక్‌ రన్‌ను ఘనంగా నిర్వహించారు. రాజరాజేంద్ర చౌరస్తా వద్ద కలెక్టర్‌ నారాయణరెడ్డి జెండా ఊపి రన్‌ ప్రారంభించారు.

నగరంలో ఒలింపిక్‌ రన్‌

  ప్రారంభించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి

సుభాష్‌నగర్‌, జూన్‌ 22: అంతర్జాతీయ ఒలింపిక్‌ డే సందర్భంగా నగరంలో జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒలింపిక్‌ రన్‌ను ఘనంగా నిర్వహించారు. రాజరాజేంద్ర చౌరస్తా వద్ద కలెక్టర్‌ నారాయణరెడ్డి జెండా ఊపి రన్‌ ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి జిల్లాలోని వివిధ క్రీడల్లో ప్రావీణ్యం పొందిన క్రీడాకారుల ద్వారా జ్యోతిని కలెక్టరేట్‌ వరకు తీసుకువచ్చారు. ఈ రన్‌ రాజరాజేంద్ర చౌరస్తా నుంచి పెద్దబజార్‌, గాంధీచౌక్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ మీదుగా కలెక్టరేట్‌ మైదానం వరకు కొనసాగింది. ర్యాలీలో విద్యార్థులు ప్రదర్శించిన కర్రసాము, క్రీడా నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టరేట్‌ మైదానంలో రన్‌ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ అర్వింద్‌ బాబు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. తాను చిన్ననాటి నుంచే చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. క్రీడాకారులు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించుకుని జిల్లాకు పేరు తీసుకురావాలన్నారు. అనంతరం టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు అలుక కిషన్‌ మాట్లాడుతూ.. ఒలింపిక్‌ రన్‌ నిర్వహించడం వల్ల క్రీడాకారుల్లో ఐక్యత ఏర్పడుతుందన్నారు. అనంతరం ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడిల రాములు మాట్లాడుతూ.. క్రీడలు అనేవి జీవితంలో భాగస్వామ్యం చేసుకుని క్రీడల ద్వారా మంచి ఫలితాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆంద్లా లింగయ్య, కోశాధికారి బొబ్బిలి నర్సయ్య, టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు అలుక కిషన్‌, ప్రధాన కార్యదర్శి అమృత్‌కుమార్‌, ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు జయసింహాగౌడ్‌, బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, మీసాల శ్రీనివాస్‌, నల్ల సూర్యప్రకాష్‌రెడ్డి, డేవిడ్‌, విద్యాసాగర్‌రెడ్డి, సాయారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-23T06:54:47+05:30 IST