కొవిడ్ ఎఫెక్ట్.. భారత ప్రయాణికులపై ఒమన్ తాత్కాలిక నిషేధం

ABN , First Publish Date - 2021-04-23T14:08:34+05:30 IST

భారత్‌లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుడటంతోపాటు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఒమన్ కీలక నిర్ణయం తీ

కొవిడ్ ఎఫెక్ట్.. భారత ప్రయాణికులపై ఒమన్ తాత్కాలిక నిషేధం

మస్కట్: భారత్‌లో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుడటంతోపాటు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఒమన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వెళ్లే ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆదేశాలు ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో ఒమన్ తెలిపింది. అయితే ఒమన్ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ఎటువంటి ఆంక్షలు లేవని ఒమన్ స్పష్టం చేసింది. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కూడా భారత ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రంజాన్ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న వారు.. తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోంటున్నారు. ఇదిలా ఉంటే.. కువైత్, సౌదీ అరేబియాలో ఇప్పటికే ప్రయాణ ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వేలాది మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. 


Updated Date - 2021-04-23T14:08:34+05:30 IST