టీచింగ్ స్టాఫ్, వారి ఫ్యామిలీలకు ఒమన్ తీపి కబురు!

ABN , First Publish Date - 2021-08-03T13:40:55+05:30 IST

సుల్తానేట్‌కు తిరిగొచ్చే టీచింగ్ స్టాఫ్, వారి ఫ్యామిలీలకు గల్ఫ్ దేశం ఒమన్ తీపి కబురు చెప్పింది. వీరికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

టీచింగ్ స్టాఫ్, వారి ఫ్యామిలీలకు ఒమన్ తీపి కబురు!

మస్కట్: సుల్తానేట్‌కు తిరిగొచ్చే టీచింగ్ స్టాఫ్, వారి ఫ్యామిలీలకు గల్ఫ్ దేశం ఒమన్ తీపి కబురు చెప్పింది. వీరికి ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవెట్ విద్యా సంస్థలతో పాటు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచింగ్ స్టాఫ్, వారి కుటుంబాలకు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఒమన్ సుప్రీం కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏఏ పేర్కొంది.


ఈ నేపథ్యంలో ఒమన్‌కు విమాన సర్వీసులు నడిపిస్తున్న ఎయిర్‌లైన్లకు ప్రత్యేక నోఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. విమాన సంస్థలన్నీ తప్పకుండా ఈ ఆదేశాలను పాటించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, ఒమన్ వచ్చే ప్రయాణికులు హోం క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి అని ఆ దేశ ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక ఇంతకుముందు గతంలో సీఏఏ అన్ని వైద్య, వైద్య సహాయ విభాగాలను మరియు వారి కుటుంబాలను తప్పనిసరి సంస్థాగత నిర్బంధం నుండి మినహాయింపు ప్రకటించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-03T13:40:55+05:30 IST