
మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ మరోసారి విదేశీ ప్రయాణికుల ప్రవేశ మార్గదర్శకాలను పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు 2021 జనవరి 26వ తేదీన తీసుకువచ్చిన ఎంట్రీ మార్గదర్శకాలు యధావిధిగా కొనసాగుతాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) వెల్లడించింది. ఇక పాత మార్గదర్శకాల ప్రకారం విదేశీయులు ఒమన్‌లోకి ప్రవేశించాలంటే.. 1. రెండు డోసుల వ్యాక్సినేషన్ తప్పనిసరి. ఇది 18 ఏళ్లకు పైబడిన ప్రవాసులు, విదేశీయులందరికీ వర్తిస్తుంది. 2. ఒమన్ చేరడానికి 72 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కావాలి. ఇక ఎవరైతే జర్నీకి 72 గంటల ముందు ఆన్ అరైవల్ కరోనా టెస్టుకు అంగీకరిస్తారో వారు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి