Tourist visa లపై మస్కట్‌లోని Indian Embassy కీలక సూచన!

ABN , First Publish Date - 2021-10-20T15:11:09+05:30 IST

ఒమన్ పౌరులు భారత్ వచ్చేందుకు టూరిస్ట్ వీసాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

Tourist visa లపై మస్కట్‌లోని Indian Embassy కీలక సూచన!

మస్కట్: ఒమన్ పౌరులు భారత్ వచ్చేందుకు టూరిస్ట్ వీసాల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో అక్టోబర్ 15 కంటే ముందు తీసుకున్న వీసాలను సస్పెండ్ చేసినట్లు ఈ సందర్భంగా ఎంబసీ తెలిపింది. అందుకే భారత్ వెళ్లాలనుకునే ఒమనీలు మరోసారి పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇటీవలే భారత్‌లో కోవిడ్ నిబంధనలు సడలించడంతో తాజాగా వీసాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా అక్టోబర్ 15 నుంచి పర్యాటక వీసాల జారీ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఎంబసీ ప్రకటించింది. వీసాలు పొందిన వారికి నవంబర్ 15 నుంచి భారత్‌లో సందర్శనకు అనుమతి ఉంటుందని తెలియజేసింది. 


కాగా, టూరిస్ట్ వీసా అనేది 30 రోజుల గడువుతో జారీ చేయబడుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. టూరిస్ట్ వీసాలు కావాల్సిన వారు ఒమన్ Wattayahలోని బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ నుండి దరఖాస్తు చేసుకోవాలి. లేదా http://www.indianvisaonline.gov.in/evisa ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.  ఇక భారత్ వెళ్లిన తర్వాత అక్కడి కరోనా నిబంధనలను పాటించడం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు వెల్లడించారు.    

Updated Date - 2021-10-20T15:11:09+05:30 IST